విశ్వాస పరీక్షలో నెగ్గిన ప్రమోద్ సావంత్

గోవా అసెంబ్లీలో ప్రమోద్ సావంత్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. బల పరీక్షలో వందశాతం గెలుస్తామని ధీమాతో ఉన్న బీజేపీ నేతలకు అనుకున్నట్లుగానే మెజార్టీ మార్క్ నిరూపించుకున్నారు. 20 మంది ఎమ్మెల్యేలు ప్రమోద్ సావంత్ ప్రభుత్వానికి మద్దతు పలికారు. బీజేపీ సభ్యులు 11 మంది, గోవా ఫార్వర్డ్ పార్టీ నుంచి ముగ్గురు, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ నుంచి ముగ్గురు, మరో ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పక్షాన 15 మంది సభ్యులు నిలిచారు.

గోవా అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేలు 40 మంది. అయితే ఇప్పటికే మూడు ఖాళీలయ్యాయి. మొన్న పారికర్ మరణంతో గోవా అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 36కు తగ్గిపోయింది. గతంలోనే మరో బీజేపీ ఎమ్మెల్యే ఫ్రాన్సిస్ డిసౌజా చనిపోయారు. ప్రభుత్వం నిలబడాలంటే 19 మంది సభ్యుల బలం అవసరం ఉండగా బీజేపీకి 20 మంది మద్దతు పలికారు.

Latest Updates