టూరిస్టుల‌కు గోవా రీ ఓపెన్!

దేశంలోనే బెస్ట్ టూరిస్ట్ స్పాట్ల‌లో ఒక‌టైన గోవా త్వ‌ర‌లోనే ప‌ర్యాట‌కుల‌కు వెల్ కం చెప్ప‌బోతోంది. గోవా క‌రోనా ఫ్రీ స్టేట్ గా మారింద‌ని, త్వ‌ర‌లోనే దేశీయ టూరిస్టులకు మ‌ళ్లీ గోవా ఆహ్వానం ప‌ల‌క‌బోతోంద‌ని చెప్పారు గోవా గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్. ప్ర‌జ‌ల‌కు మ‌ళ్లీ గోవా టూరిస్ట్ డెస్టినేష‌న్ గా కొన‌సాగుతుంద‌ని, దేశంలో గోవా లాంటి క్లీన్ సిటీ మ‌రొక‌టి లేద‌న్నారు. కొద్ది రోజుల్లోనే దేశంలోని ప్ర‌జ‌లు గోవా ప‌ర్య‌ట‌న‌కు రావ‌చ్చ‌ని, అయితే విదేశీ టూరిస్టుల‌ను అనుమ‌తించ‌డానికి కొన్నాళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పారు.

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా జ‌నాలు గుంపులుగా చేరే అన్ని ర‌కాల యాక్టివిటీల‌పై నిషేధం విధించ‌డంతో దేశంలో అన్ని ప‌ర్యాట‌క ప్రాంతాలు క్లోజ్ అయ్యాయి. అలాగే బ‌స్సులు, రైళ్లు, విమానాలు అన్ని నిలిచిపోయాయి. ఇటీవ‌లే బ‌స్సులు, రైళ్ల ప్ర‌యాణాల‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో పాటు సోమ‌వారం నుంచి విమాన స‌ర్వీసుల‌ను కూడా ప్రారంభించ‌బోతోంది. అయితే ఇప్ప‌టికే గోవా క‌రోనా ఫ్రీ స్టేట్ గా మార‌డంతో త్వ‌ర‌లోనే ప‌ర్యాట‌కుల‌ను అనుమ‌తించేందుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. గోవాకు ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు ప‌ర్యాట‌క‌మే కావ‌డంతో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కాకుండా జాగ్రత్త‌లు తీసుకుంటూ బీచ్ ల‌కు ప‌ర్యాట‌కుల‌ను అనుమ‌తించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Latest Updates