వడ్ల కొనుగోలు కేంద్రంలో గోల్​మాల్​.. రూ. 14 లక్షలు కొట్టేసిన మహిళ ఆపరేటర్

రైతుల పైసలు కొట్టేసింది

వడ్ల కొనుగోలు కేంద్రంలో గోల్​మాల్​

రూ. 14 లక్షలు కొట్టేసిన మహిళ

శాయంపేట, వెలుగు: ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రంలో పని చేసే మహిళ రైతుల వివరాలు తప్పుగా నమోదు చేసి రూ. 14 లక్షలు కొట్టేసింది. ధాన్యం డబ్బులు తక్కువగా వచ్చాయని రైతులు ఫిర్యాదు చేయడంతో జరిగిన మోసం బయటపడింది. ఈ ఘటన వరంగల్​రూరల్​జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారంలో వెలుగుచూసింది. గత యాసంగిలో ప్రగతిసింగారం వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహణ బాధ్యతల కోసం కొత్త కమిటీ వేశారు. ట్యాబ్ ​ఆపరేటర్​గా స్థానిక వీవోఏను నియమించారు. కేంద్రంలో మొత్తం 30,366 బస్తాల వడ్లను రైతులు విక్రయించారు. వడ్లను అమ్మిన రైతుల పూర్తి వివరాలను సివిల్​సప్లయ్​డిపార్ట్ మెంట్​వెబ్​సైట్​లో నమోదు చేయాలి. అయితే వీవోఏ రైతుల వడ్ల బస్తాల సంఖ్య తక్కువగా నమోదు చేశారు. అలా మిగిలిన వడ్ల బస్తాలకు సంబంధించిన డబ్బుల కోసం 14 వరకు ఇతరుల బ్యాంకు అకౌంట్ల నంబర్లు ఇచ్చారు. ఇలా రూ.14 లక్షల వరకు మోసానికి పాల్పడ్డారు. వీవోఏ స్వయంగా తన బ్యాంక్​ అకౌంట్​ ద్వారా ముగ్గురు రైతులకు చెందిన రూ.2.32 లక్షలు డ్రా చేసుకుంది.      డబ్బులు తక్కువగా రావడంతో ఆందోళన చెందిన రైతులు వడ్ల కొనుగోలు కేంద్రం అధ్యక్షురాలు, ఇతర సభ్యులను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. స్థానిక వీవోఏ రైతుల సొమ్ము రూ.14 లక్షలు ఫ్రాడ్​ చేసినట్లుగా తేలడంతో కొనుగోలు కేంద్రం అధ్యక్షురాలు, రైతులంతా కలిసి ఈ నెల 26న డీఆర్డీవో పీడీకి కంప్లైంట్​ చేశారు. దీంతో ప్రభుత్వ అధికారులు విచారణ జరుపుతున్నారు.

For More News..

అధికారుల తప్పిదంతో మూడేళ్లుగా అందని రైతుబంధు

రైతు.. ఇప్పుడిక బిజినెస్ మ్యాన్

ఎవరు పడితే వాళ్లతో ఆస్తుల సర్వే

Latest Updates