మొక్కలు మేసిందని.. రూ.2 వేలు ఫైన్

నారాయణ పేట జిల్లా : హరితహారంలో భాగంగా ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో అధికారులు మొక్కలు నాటారు. అటుగా వచ్చిన ఓ మేక ఆ మొక్కల్ని మేసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అధికారులు ఆ మేకను తాడుతో అదే ఆఫీస్ లో కట్టేశారు. మొక్కల్ని తిన్నందుకు దాని యజమాని రూ.2 వేలు జరిమానా చెల్లించి తీసుకువెళ్లాలని రాసిన బోర్డును మేక మెడకు తగిలించారు. నారాయణ పేట జిల్లా మక్తల్ ఎంపీడీవో ఆఫీస్ లో శుక్రవారం ఇది చోటు చేసుకుంది.

Latest Updates