గాడ్సే ఎప్పటికీ దేశభక్తుడే : సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్

godse-is-desh-bhakth-says-sadhvi-pragya-thakur

మహాత్ముడిని పిస్టల్ తో కాల్చిచంపిన నాథూరాం గాడ్సే ఓ హిందూ టెర్రరిస్ట్ అంటూ మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదం మరింత ముదురుతోంది. కమల్ హాసన్ వ్యాఖ్యలను తప్పుపడుతూ.. ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్ట్ లో క్రిమినల్ కంప్లైంట్ దాఖలైంది. గాడ్సే, హిందూ టెర్రరిజం ఇష్యూపై వచ్చిన విమర్శలను బీజేపీ నేతలు తప్పుపట్టారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తాజా ఈ అంశంపై స్పందించారు. నాథూరాం గాడ్సే ఎప్పటికీ దేశభక్తుడే అని ఆమె అన్నారు. “నాథూరం గాడ్సే ఆనాడు దేశభక్తుడుగా ఉన్నారు. దేశంపై తన ప్రేమ చాటుకున్నారు. ఇప్పుడు కూడా దేశభక్తుడుగానే అభిమానులు కొలుస్తున్నారు. ఎప్పటికీ ఆయన దేశభక్తుడిగానే మిగిలిపోతారు. గాడ్సేను టెర్రరిస్టుగా  చెబుతున్నవారు.. ఒకసారి అంతర్మథనం చేసుకోవాలి. ఈ ఎన్నికలే విమర్శకులకు సరైన సమాధానం చెబుతాయి” అన్నారు సాధ్వి ప్రజ్ఞా.

Latest Updates