తీసుకెళ్లిన మొక్కలు పడేశారని రూ.5 వేల ఫైన్‌‌

కీసర, వెలుగు: గ్రామ పంచాయతీ నుంచి మొక్కలు తీసుకెళ్లి నాటకుండా పడేసినందుకు కాలనీ సంఘానికి ఆఫీసర్లు ఐదు వేల రూపాయల జరిమానా విధించారు. కీసర మండలం గోధుమకుంటకు చెందిన హెవెన్ డౌన్ కాలనీ అసోసియేషన్ సభ్యులు వారం రోజులు క్రితం గ్రామ పంచాయతీ ఆఫీసు నుంచి 250 మొక్కలు తీసుకెళ్లారు. వాటిని నాటకుండా పక్కన పడేశారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో శుక్రవారం మండల ఈవోపీఆర్డీ యుగంధర్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ సుధీర్‌‌బాబుతో కలిసి హెవెన్ డౌన్ కాలనీకి వెళ్లి నిర్లక్ష్యంగా పడేసిన మొక్కలను పరిశీలించి రూ.5 వేలు జరిమానా విధించారు. అనంతరం ఆ మొక్కలను కాలనీ వాసులతో అదే కాలనీలో నాటించినట్లు ఈవోపీఆర్డీ తెలిపారు.

 

Latest Updates