డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తూ.. హోంగార్డు మృతి

హైదరాబాద్: డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో హోమ్ గార్డ్ మృతి చెందాడు. సాగర్ హైవేపై ఆగపల్లి సమీపంలో జరిగిందీ ఘటన. మృతుడు యాచారం మండలం గన్ గల్ గ్రామానికి చెందిన బుర్కి నరేష్(34) రాత్రి డ్యూటీ ముగిసిన తర్వాత బైకుపై ఇంటికి బయలుదేరి వెళుతూ.. ఆగివున్న లారీని ఢీకొన్నాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి సమీపంలో ఆగివున్న లారీని బైక్ ఢీకొట్టి పడిపోయాడు. గాయపడిన నరేష్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ప్రయోజనం లేకపోయింది. ప్రమాదంపై మంచాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడు నరేష్ కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

Latest Updates