భారీ వర్షాలకు కూలిపోయిన గోల్కొండ కోట గోడ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోల్కోండ కోటలోని ఓ గోడ కూలిపోయింది. శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయానికి ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తైన గోడ కూలిపోయింది. కరోనా కారణంగా పర్యాటకుల తాకిడి లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 10 నెలల క్రితమే ఈ గోడపైన ధ్వంసమైన బురుజులకు పురావస్తు శాఖాధికారులు మరమ్మతులు చేయించారు. కానీ ప్రహరీ గోడ కింది భాగంలో అప్పటికే పగుళ్లు వచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో వరుసగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఆ గోడ పూర్తిగా తడిసి కుప్పకూలిపోయింది.

Latest Updates