శంషాబాద్ లో 420 గ్రాముల గోల్డ్ స్వాధీనం

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమ బంగారం పట్టుబడింది. ఇద్దరు ప్రయాణీకుల నుంచి 700 గ్రాములకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైద్రాబాద్ వచ్చిన నరియాల్ వాల్ అనే వ్యక్తి నుంచి 375 గ్రాముల గోల్డ్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. బంగారాన్ని పేస్ట్ లా కరిగించి… షూలో పెట్టుకొని వస్తుండగా గుర్తించారు.

మరో కేసులో మర్రి శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చే ప్లైట్లో బంగారం తీసుకొస్తుండగా పట్టుకున్నారు కస్టమ్స్ ఆఫీసర్లు. కుక్కర్ లోపల సిల్వర్ కోటింగ్ తో తయారు చేసిన బంగారు ప్లేట్ ను అమర్చి తీసుకొస్తుండగా గుర్తించారు. ఇదే ప్లైట్లో మరో ప్రయాణీకుడి టాయ్ కార్ బొమ్మలో బంగారం తెస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు కస్టమ్స్ ఆఫీసర్లు. వీరి నుంచి 348 గ్రాముల బంగారం గుర్తించారు.

Latest Updates