బంగారం ఆల్ టైమ్ రికార్డ్ : రూ. 42 వేల మార్కుని దాటింది

బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు ను క్రియేట్ చేస్తున్నాయి. బుధవారం పది గ్రాముల ప్యూరో గోల్డ్ ధర 42 వేల మార్కుని దాటింది. గత ఏడేళ్లలో ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటి సారి అంటున్నాయి మార్కెట్ వర్గాలు. ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే బంగారం పెరుగుదలకు కారణమంటున్నాయి. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తత పరిస్థితులతో బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పది గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర 42 వేల 860కి చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ 39వేల 270గా నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. బుధవారం అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం రేటు 2 శాతం పెరిగి 16 వందల డాలర్లకు పైగా నమోదయింది. రూపాయి మారకం విలువ తగ్గడం, ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ముడి చమురు ధరలు పెరుగుతుండటం, ఈక్విటీ మార్కెట్ల పతనంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా ఇన్వెష్టర్లు బంగారాన్ని ఎంచుకుంటున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇప్పుడు గోల్డ్ కొనాలనుకునే వారు కాస్త ఆలోచించి.. అత్యవసరం అయితే తప్ప బంగారం కొనవద్దని సూచిస్తున్నారు.

Latest Updates