టాయిలెట్​ కోసం తవ్వితే..బంగారు, వెండి నాణేలు దొరికినయ్

గద్వాల, వెలుగు: మరుగుదొడ్డి నిర్మాణానికి గుంతలు తవ్వుతుండగా బంగారు వెండి నాణేలు దొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండలం పూడూరులో చాకలి వెంకటన్న అనే వ్యక్తి తన ఇంటి దగ్గర లెట్రిన్ రూమ్ నిర్మాణం కోసం గుంతలు తవ్వుతుండగా.. అందులోంచి బంగారు, వెండి నాణేలున్న కుండ బయటపడింది. ఈ విషయం బయటకు పొక్కనీయకుండా.. దొరికిన నాణేలలో  కొన్నింటిని ఇరుగు పొరుగు వారికి ఇచ్చి, మిగతా వాటిని తనవద్దే ఉంచుకున్నాడు. ఆనోటా ఈ నోటా ఈ ముచ్చట కాస్త పోలీసులు, రెవెన్యూ అధికారుల చెవిలో పడింది. స్థానిక ఎస్సై, ఆర్ఐలు వెంకటన్న ఇంటికి చేరుకుని 11 బంగారు, 19 వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు.

Latest Updates