దిగొచ్చిన గోల్డ్, సిల్వర్ ధరలు

కొన్ని నెలలుగా పరుగులు పెడుతున్న బంగారం ధర కాస్త దిగి వచ్చింది. బుధవారం రూ.301 తగ్గడంతో 10 గ్రాముల గోల్డ్ రూ.38, 870కి చేరింది. ఇప్పటివరకు రూ.40వేలకు పైగా చేరడంతో బంగారం కొనాలనుకునేవారు కాస్త ఆలోచనలో పడ్డారు. సేల్స్ కూడా తగ్గాయి. దీంతో మళ్లీ బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో సేల్స్ పెరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు. చాలా రోజుల తర్వాత 38 వేల మార్క్ చేరింది.

గోల్డ్ బాటలోనే సిల్వర్

బుధవారం వెండి రూ.906 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.46, 509గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో వెండి ధరలు కూడా దిగొస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింతగా తగ్గే అవకాశం ఉందంటున్నారు వ్యాపారస్తులు.

Latest Updates