మేడారం జాతరలో శునకానికి నిలువెత్తు బంగారం

మేడారం జాతరకు వెళ్లిన భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. తమ ఎత్తు బంగారాన్ని(బెల్లం) సమ్మక్క,సారలమ్మకు సమర్పించుకుంటారు. ఈ జాతరలో ఓ దంపతులు కూడా బంగారం సమర్పించుకున్నారు. అయితే తమకు సంబంధించో…తమ పిల్లలకో కాదు. తాము అల్లారు ముద్దుగా పెంచుకునే శునకానికి. సమ్మక్క,సారలమ్మకు శునకానికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

పెద్ద పల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఈ దంపతులు పెంచుకున్న శునకం గతంలో కనిపించకుండా పోయిందట. ఆ సమయంలో ఆ శునకం మళ్లీ తమకు దొరకాలని సమ్మక్క-సారలమ్మకు మొక్కుకున్నారట. దీంతో అది రెండు రోజుల్లో తిరిగి ఇంటికి చేరుకోవడంతో ఆ దంపతులు మొక్కులు తీర్చుకున్నారు.

Latest Updates