గోల్డ్‌‌ దిగుమతి తగ్గించిన్రు..

జూలై నుంచి నెగిటివ్‌‌ గ్రోత్‌‌

న్యూఢిల్లీ : దేశీయ కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)కు భారంగా ఉన్న గోల్డ్ దిగుమతులు తగ్గాయి. ప్రస్తుత ఆర్తిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్య కాలంలో గోల్డ్ దిగుమతులు 9 శాతం పడిపోయి రూ.1.74 లక్షల కోట్లుగా ఉన్నట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటాలో తెలిసింది. గతేడాది ఇదే కాలంలో ఈ దిగుమతులు రూ.1.93 లక్షల కోట్లుగా ఉన్నాయి. గోల్డ్ దిగుమతులు తగ్గడంతో, ఏప్రిల్–జనవరి మధ్య కాలంలో దేశీయ వాణిజ్య లోటు కూడా రూ.9.53 లక్షల కోట్లకు(133.27 బిలియన్ డాలర్లకు) తగ్గింది. ఈ వాణిజ్య లోటు గతేడాది ఇదే కాలంలో 163.27 బిలియన్ డాలర్లుగా ఉంది. గతేడాది జూలై నుంచి గోల్డ్ దిగుమతులు తగ్గుతూనే ఉన్నాయి. గతేడాది అక్టోబర్, నవంబర్‌‌‌‌లోనే పాజిటివ్ గ్రోత్‌‌ను ఇవి నమోదు చేశాయి. ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ ఇంపోర్టర్. వాల్యుమ్ పరంగా చూసుకుంటే, ఇండియా వార్షికంగా 800 టన్నుల నుంచి 900 టన్నుల వరకు గోల్డ్‌‌ను దిగుమతి చేసుకుంటోంది. వాణిజ్య లోటు, క్యాడ్‌‌పై గోల్డ్ దిగుమతులు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుండటంతో, ప్రభుత్వం ఈ మెటల్‌‌పై ఉన్న దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. అయితే జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతిదారులు మాత్రం ఈ దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు.

Latest Updates