టైలర్ కొడుక్కు గోల్డ్ మెడల్

కాజీపేట, వెలుగు: సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నిట్  బీటెక్ స్టూడెంట్ మహ్మద్ ఇస్మాయిల్  గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. హైదరాబాద్ లోని పాతబస్తీకి చెందిన ఇస్మాయిల్.. సివిల్ ఇంజనీరింగ్​లో టాపర్ గా నిలిచిచాడు. అర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా.. చదువుల్లో రాణించాడు. నిట్ లో సీటు పొందినప్పటి నుంచి కష్టపడి చదువుతూ ప్రొఫెసర్ల మన్ననలు పొందాడు. తన తండ్రి ఫయీమ్ టైలరింగ్ చేస్తూ తనని చదివించారని, తల్లి గృహిణి అని ‘వెలుగు’తో చెప్పాడు. ఎల్ అండ్ టీ కంపెనీలో ప్రస్తుతం 6 లక్షల వార్షిక వేతనంలో ట్రెయినీ ఇంజనీర్​ గా పనిచేస్తున్నానని, అవకాశం ఉంటే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ చేయాలని ఉందని తెలిపాడు. గోల్డ్ మెడల్ రావడం సంతోషంగా ఉందన్నాడు.

Latest Updates