తెలంగాణ బాక్సర్‌‌ హుసాముద్దీన్‌కు గోల్డ్‌ మెడల్

ప్రసాద్‌‌, శివ థాపాకు స్వర్ణాలు

నేషనల్‌‌ బాక్సింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో తెలంగాణ బాక్సర్‌‌ మహమ్మద్‌‌ హుసాముద్దీన్‌‌ (57కేజీ) గోల్డెన్‌‌ పంచ్‌‌ విసిరాడు. అతనితో పాటు ఏపీకి చెందిన పి. లలిత ప్రసాద్‌‌ (52 కేజీ), స్టార్‌‌ బాక్సర్‌‌ శివ థాపా (63 కేజీ) తమ విభాగాల్లో చాంపియన్లుగా నిలిచారు. సర్వీసెస్‌‌ తరఫున బరిలోకి దిగిన హుసామ్‌‌  గురువారం జరిగిన ఫైనల్‌‌ బౌట్‌‌లో 3–2తో  రైల్వేస్‌‌కు చెందిన మరో టాప్‌‌ బాక్సర్‌‌ సచిన్‌‌ సివాచ్‌‌పై ఉత్కంఠ విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన ఈ బౌట్‌‌లో సచిన్‌‌ తన హైట్‌‌ను సద్వినియోగం చేసుకొని ఫస్ట్‌‌ రౌండ్‌‌లో  హుసామ్‌‌పై  ఆధిపత్యం చెలాయించాడు. కానీ, తర్వాతి రెండు రౌండ్లలో తెలంగాణ బాక్సర్‌‌ గొప్పగా పుంజుకున్నాడు. కౌంటర్‌‌–అటాకింగ్‌‌ పంచ్‌‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడి గోల్డ్‌‌ కైవసం చేసుకున్నాడు. 52 కేజీ ఫైనల్లో ప్రసాద్‌‌ (సర్వీసెస్‌‌) 3–2తో ఆశిష్‌‌ ఇన్షాను ఓడించాడు. శివ థాపా 4–1తో ఆకాశ్‌‌ (సర్వీసెస్)పై ఈజీగా గెలవగా.. నవీన్‌‌ బూర (69 కేజీ), వినోద్‌‌ (52కేజీ) తమ విభాగాల్లో టైటిళ్లు నెగ్గారు. ఆరు స్వర్ణాలు సహా 9 మెడల్స్​తో సర్వీసెస్‌‌.. టోర్నీలో టాప్‌‌ ప్లేస్​ సాధించింది.

Latest Updates