ఒక్కరోజే రూ. 405 తగ్గిన బంగారం ధర

గోల్డ్ కొనే వారికి గుడ్ న్యూస్. గురువారం ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర రూ.405 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.32,560. ఢిల్లీలో బంగారం ధర రూ.32,225 ఉంది. సావరిన్ గోల్డ్ రూ.100 తగ్గింది. 8 గ్రాముల ధర రూ.26,300 ఉంది.

డిమాండ్ తగ్గడం వల్లే రేటు తగ్గిందంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 1,276.10 యూఎస్ , ఔన్స్ వెండి ధర 15.10 యూఎస్ డాలర్లు.  బంగారం మాత్రమే కాదు… వెండి కూడా కేజీపై రూ.104 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.38,246 గా ఉంది.

Latest Updates