కరోనా ఎఫెక్ట్‌తో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర

న్యూఢిల్లీ : బంగారం ధరలు మళ్లీ మెరుస్తున్నాయి. రికార్డు బ్రేకింగ్ స్థాయిలో దూసుకెళ్తున్నాయి. కోవిడ్‌‌ ఎఫెక్ట్‌‌తో గ్లోబల్‌‌గా గోల్డ్ ధరలు ఏడేళ్ల గరిష్టానికి ఎగియడంతో, దేశీయ మార్కెట్‌‌లో కూడా భగ్గుమంటున్నాయి. ఎంసీఎక్స్‌‌ మార్కెట్‌‌లో శుక్రవారం గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ.42,509గా పలికింది. ఈ వారం ప్రారంభం నుంచి దాదాపు రూ.1,500 మేర ఈ ధర పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్‌‌ కూడా ఎంసీఎక్స్ మార్కెట్‌‌లో కేజీకి రూ.48,410 వద్ద ట్రేడైంది. గ్లోబల్‌‌గా గోల్డ్ ధరలు ఒక ఔన్స్‌‌కు 1,625.05 డాలర్లకు పెరిగాయి. గోల్డ్‌‌లో ఇన్వెస్ట్‌‌మెంట్లు కూడా కంటిన్యూగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్‌‌ ట్రేడెడ్ ఫండ్ ఎస్‌‌పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్స్ 0.25 శాతం పెరిగి 933.94 టన్నులకు చేరుకున్నాయి.

Latest Updates