రూ.1200 తగ్గిన బంగారం ధర

గత కొన్ని రోజులుగా ఆకాశన్నంటుతున్న బంగారం ధరకు మంగళవారం బ్రేక్‌ పడింది. గత ఐదురోజుల్లో పదిగ్రాముల బంగారం ఏకంగా రూ. 3000 పెరిగి రూ.45వేలకు ఎగబాకింది. అయితే మంగళవారం అదే స్థాయిలో పడిపోయింది. ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్  రూ.1200 తగ్గి (పది గ్రాములకు) రూ.42,855కి క్షీణించింది. ఐదు రోజుల తర్వాత బంగారం ధర తగ్గడం ఇదే తొలిసారి. ఎంసీఎక్స్‌లో కిలో వెండి కూడా రూ. 1495 తగ్గి రూ. 47,910కి చేరింది. డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడం కూడా హాట్‌ మెటల్స్‌ ధరలు దిగివచ్చేందుకు కారణమని బులియన్‌ నిపుణులు పేర్కొన్నారు.

Latest Updates