వరుసగా నాలుగో రోజూ దిగిన బంగారం రేట్లు

ఈ నెలలో రూ.4,300 తగ్గిన 10 గ్రాముల రేటు
వెండిధరలు కూడా తగ్గుముఖం

న్యూఢిల్లీ: బంగారం కొనే జనం సంఖ్య తగ్గుతూనే ఉండటంతో ధరలు దిగొస్తున్నాయి. వరుసగా నాలుగో రోజైన సోమవారం కూడా రేట్లు తగ్గాయి. ఎంసీఎక్స్‌ అక్టోబరు గోల్డ్‌ ఫ్యూచర్స్‌‌లో గ్రాము బంగారం రేటు 0.3 శాతం తగ్గింది. దీంతో పది గ్రాముల బంగారం రేటు రూ.51,865కు చేరింది. నాలుగు రోజుల్లో పది గ్రాముల బంగారం రేటు రూ.1,700లు తగ్గింద. వెండి ధరల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మల్టీ కమోడిటీ ఎక్సేంజీలో వెండి కిలో రేటు ఒకశాతం తగ్గి రూ.66,426గా రికార్డయింది.ఇదివరకటి సెషన్‌‌లోనూ బంగారం రేటు 0.3 శాతం పడింది.ఈనెల ఏడున పది గ్రాముల బంగారం రేటు ఏకంగా రూ.56,200లకు చేరింది. ఆరోజు నుంచి సోమవారం నాటికి రేటు దాదాపు రూ.4,300 వరకు తగ్తింది. దీంతో డీలర్లు కస్టమర్లకు డిస్కౌంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఇకముందు కూడా బంగారం రేట్లు పెరిగే అవకాశాలు లేవని కోటక్‌ సెక్యూరిటీస్‌ ‌విడుదల చేసిన నోట్‌ ‌పేర్కొంది. అయితే పండగల సీజన్‌‌ నాటికి రేట్లు మళ్లీ పెరగొచ్చని వ్యాపారులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగానూ బంగారం రేట్లు పడిపోతున్నాయి. స్టిములస్‌  ప్యాకేజీ గురించి ఇప్పటికీ క్లారిటీ రాకపోవడంతో అమెరికాలో బంగారం వంటి విలువైన లోహాలకు డిమాండ్‌‌ తగ్గుతోంది. ప్రస్తుతం అక్కడ స్పాట్‌‌ గోల్డ్‌ ఔన్స్‌ రేటు 0.3శాతం తగ్గి 1,933 డాలర్లకు చేరింది. గోల్డ్‌ఫ్యూచర్స్‌ రేటు కూడా 0.4 శాతం తగ్గి 1,910 డాలర్లకు పడిపోయింది. వెండి రేటు ఔన్సుకు 0.6 శాతం తగ్గి 26 డాలర్లుగా రికార్డయింది. చైనాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ విలువైన లోహాలకు డిమాండ్‌ ‌తగ్గుతోంది.

తులం రేటు రూ.1,31,530?
అమెరికా ఎక్స్‌‌‌‌పర్టుల అంచనా
ప్రపంచవ్యాప్తంగా బంగారం రేట్లు పడిపోతున్నా, గ్లోబల్‌ ఎనలిస్టులు మాత్రం పెరుగుతాయని చెబుతున్నారు. ఎగుమతులు పెరుగుతాయని అంటున్నారు. రీసెర్చ్‌ ఫర్మ్‌ జెఫెరీస్‌ గ్లోబల్‌ హెడ్ (ఈక్విటీ స్ట్రాటెజిస్ట్‌‌) క్రిస్టఫర్‌ వుడ్‌‌ మాట్లాడుతూ.. గోల్డ్‌రేట్లు 180 శాతం పెరుగుతాయని చెప్పారు. ఔన్సు బంగారం (దాదాపు 31 గ్రాములు) ధర వరకు 5,500 డాలర్లు (దాదాపు రూ.4,07,757) తాకుతుందని అన్నారు. ఇండియా కరెన్సీతో లెక్కిస్తే గ్రాము ధర రూ.13,153 వరకు ఉంటుంది. ఔన్సు బంగారం రేట్లు 4,200 డాలర్లకు చేరుతుందని ఈ ఏడాది మొదట్లో చెప్పిన క్రిస్టఫర్‌ దానిని ఇప్పుడు 5,500 డాలర్లకు పెంచారు.‘‘ మనిషి ఆశ, భయాలే బంగారం రేట్లను ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం అమెరికాలో ఔన్సు గోల్డ్‌ రేటు 1,952 డాలర్లు పలుకుతోంది. ఇది 5,500డాలర్లకు చేరుతుంది.ఇండియా వంటి దేశాల్లో మాత్రం గోల్డ్‌కు డిమాండ్‌ ‌పడిపోతోంది. జూన్‌‌ క్వార్టర్‌‌లో దిగుమతులు 70 శాతం తగ్గాయి ’’ అని ఆయన వివరించారు. అమెరికాకే చెందిన బోఫా సెక్యూరిటీస్‌‌ సీనియర్‌ ఎగ్జిక్గ్జి యూటివ్‌ ఒకరు మాట్లాడుతూ.. కరోనా భయాలు ఇంకా ఉన్నందున, గోల్డ్‌కు డిమాండ్‌‌ పెరుగుతుందని పేర్కొన్నారు. క్రెడిట్‌‌ స్విస్‌‌ వెల్త్‌ మేనేజ్‌‌మెంట్‌‌కు చెందిన జితేంద్ర గోహిల్‌ మాట్లాడుతూ.. మూడునెలల్లో ఔన్సు బంగారం ధర 2,000 డాలర్లకు చేరే అవకాశం ఉందన్నారు.

For More News..

చిన్న వ్యాపారాలకు నో జీఎస్‌టీ

ప్లాస్మా ట్రీట్‌మెంట్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్

Latest Updates