స్వల్పంగా తగ్గిన గోల్డ్ ధర

ఢిల్లీ: గోల్డ్ ధర గురువారం కాస్త తగ్గింది. నేటి బులియన్‌ మార్కెట్లో రూ.270 తగ్గడంతో.. 10 గ్రాముల బంగారం ధర రూ. 34 వేల180గా ఉంది. స్థానిక నగల వ్యాపారుల నుంచి గిరాకీ తగ్గడంతో.. గోల్డ్ ధర దిగొచ్చినట్లు తెలిపారు మార్కెట్ వర్గాలు. వెండి రేటు మరింత పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఉండటంతో.. కేజీ సిల్వర్ ధర రూ.120 పెరిగి, రూ.41 వేల 500కు చేరింది. అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా  కొనుగోళ్ల అండతో గత కొద్ది రోజులుగా పైపైకి పోతున్న గోల్డ్ ధర ఇవాళ కాస్త దిగి వచ్చింది.

 

Latest Updates