శంషాబాద్ ఎయిర్ పోర్టులో 3 కిలోల బంగారం పట్టివేత

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుండి ఇండిగో విమానంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల దగ్గర రూ. కోటి 10 లక్షల విలువ చేసే 3 కిలోల 951 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణీకులు తన లోదుస్తులకు ప్రత్యేకంగా జేబును కుట్టుకొని అందులో బంగారు బిస్కెట్లు తేవడానికి ప్రయత్నించగా, కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డారు. అసలు సూత్రధారుల కోసం లోతుగా విచారణ జరుపుతున్నామని తెలిపారు అధికారులు.

Latest Updates