చాక్లెట్ కవర్ గా చుట్టి.. బంగారం స్మగ్లింగ్

500 గ్రాముల బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ దొరికిపోయారు కొందరు ప్రయాణికులు. ఈ ఘటన శనివారం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. ఈ బంగారం విలువ 19.5 లక్షలు ఉంటుందని ఏయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. బంగారాన్ని సన్నని రేకులుగా మార్చి స్వీట్  డబ్బా చుట్టు అమర్చారు. దీంతో పాటు స్వీట్స్ కింద బంగారపు రేకును పెట్టి రవాణా చేస్తున్నట్టు తెలిపారు కస్టమ్స్ అధికారులు.

Latest Updates