స్వల్పంగా తగ్గిన గోల్డ్, సిల్వర్ ధరలు

ఢిల్లీ: గోల్డ్ ధర ఇవాళ కూడ కాస్త తగ్గింది. మంగళవారం రూ.145 తగ్గడంతో 10 గ్రాముల బంగారం రూ.34 వేల80కి చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ తగ్గడంతో బంగారం ధర తగ్గినట్లు తెలిపాయి బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు. అంతర్జాతీయంగాను గోల్డ్ ధర తగ్గింది. న్యూయార్క్‌ మార్కెట్లో బంగారం ధర 0.01శాతం తగ్గడంతో ఔన్సు 1,308.70 డాలర్లు పలికింది.

సిల్వర్ ధర కూడా కాస్త తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ లేకపోవడంతో వెండి ధర తగ్గింది. రూ.100 తగ్గడంతో కిలో వెండి రూ.41వేల మార్క్‌ కు చేరింది.

 

Latest Updates