వైరులో రూ.60 లక్షల బంగారం

హైదరాబాద్: విదేశాల నుండి అక్రమంగా బంగారం తరలించేందుకు దొంగలు రకరకాల ప్లాన్లు వేస్తున్న విషయం తెలిసిందే. గురువారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 1.4కిలీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. అయితే రూ.60 లక్షల విలువైన ఈ బంగారాన్ని దొంగలు తెలివిగా తీన్ వైర్ లో అమర్చారు.

ఎయిర్ పోర్ట్ లో తనిఖీలు చేయగా .. ఇది చూసిన అధికారులు షాక్ అయ్యారు. ఇంతవరకు ఇలాంటి తెలివిగల దొంగలను చూడలేదని తెలిపారు. ఈ వైర్ ను ఇద్దరు వ్యక్తులు రియాద్ నుండి తెస్తున్నట్లు తెలిపారు అధికారులు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

See Also: మండలిలో క్షమాపణలు చెప్పిన మంత్రి పువ్వాడ అజయ్

కరోనా ఎఫెక్ట్: చికెన్‌, మటన్‌లకు ప్రత్యామ్నాయం దొరికింది

సినీ దంపతులకు కరోనా వైరస్

ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడూ అనుకోలేదు

Latest Updates