షూలో పెట్టి.. వెండిపూత పూసి చుట్టి..: బంగారం స్మగ్లింగ్

  • బెల్ట్ టై, షూలో 3 కిలోల బంగారం కుట్టించి అక్రమ రవాణా
  • సిల్వర్ ఫాయిల్ రూపంలో టీవీకి చుట్టి 2 కిలోల బంగారం స్మగ్లింగ్

ఎయిర్ పోర్టు అధికారుల తనిఖీల్లో మరోసారి పెద్ద మొత్తంలో బంగారం దొరికింది. బెల్టు, టై, షూలలో 3.3 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న సురేశ్ ను అధికారులు పట్టుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక సింగపూర్ నుంచి వచ్చిన విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండయింది. ప్రయాణికులు సెక్యూరిటీ చెక్ వైపు నడుస్తుండగా అనుమానాస్పదంగా ప్రవర్తించిన సురేశ్ ను కస్టమ్స్ అధికారులు క్షుణ్నంగా తనిఖీ చేశారు. బెల్టులో, షూ, టై లో దాచిన బంగారాన్ని గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని సురేశ్ నుంచి వివరాలు సేకరించినట్టు కస్టమ్స్ అధికారులు చెప్పారు.

సిల్వర్ ఫాయిల్ రూపంలో బంగారం చుట్టుకొచ్చారు

మరో ఘటనలో.. తిరుచ్చి ఎయిర్ పోర్టులో సుమారు రూ.60 లక్షల విలువైన 2 కిలోల బంగారాన్ని పట్టుకున్నట్లు కస్టమ్స్ అధికారులు చెప్పారు. మలేషియా నుంచి వచ్చిన ప్రయాణికులు తనిఖీ చేయగా.. మురుగేశ్ అనే ప్రయాణికుడు సిల్వర్ ఫాయిల్ రూపంలో టీవీకి చుట్టిన బంగారం బయటపడిందన్నారు. టీవీని స్వాధీనం చేసుకొని మురుగేష్ ను పోలీసులకు అప్పగించినట్లు అధికారులు చెప్పారు.

Latest Updates