శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్‌ ఎయిర్‌‌పోర్ట్‌లో అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వందేభారత్‌ మిషన్‌ విమానాల్లో వస్తున్న ప్రయాణికుల నుంచి ఈ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. దామన్‌ నుంచి వచ్చిన 11 మంది 3.11 కిలోల బంగారాన్ని లో దుస్తుల్లో పెట్టుకుని తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ కోటీ అరవై లక్షల రూపాయలు అని కస్టమ్స్‌ అధికారులు చెప్పారు.

Latest Updates