ఫంక్షన్ హాలులో బంగారం చోరీ .. దంపతులను పట్టుకుని చితకబాదిన బంధువులు

కామారెడ్డి జిల్లా : మ్యారేజ్ ఫంక్షన్ హాలులో దొంగలు పడ్డ సంఘటన సోమవారం కామారెడ్డి జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్ లో పెళ్లి కుమార్తె బంధువులకు సంబందించిన మూడు తులాల బంగారాన్ని దొంగిలించారు గుర్తు తెలియని దంపతులు. బంగారం తీసుకుని పారి పోతుండగా పలువురు గట్టిగా కేకలు వేయడంతో.. పెళ్లికి వచ్చిన బంధువులు గమనించి బంగారం దొంగిలించిన దంపతులను పట్టుకున్నారు. బంగారం దొంగిలించిన దంపతులను చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..బంగారాన్ని దొంగిలించిన దంపతులు ఇందిరానగర్ కాలనీకి చెందిన పరమేశ్, యశోదలు గుర్తించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్న పోలీసులు.. గుర్తు తెలియని వ్యక్తులపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.

 

Latest Updates