ఒక్క రోజే భారీగా పెరిగినయ్ : గోల్డ్-752, సిల్వర్-960

స్వల్పంగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధర శుక్రవారం ఒక్కసారిగా భారీగా పెరిగింది. 20, 30 రూపాయలు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. పెరగడం మాత్రం వందల్లో పెంచారు. శుక్రవారం రూ. 752 పెరగడంతో 10 గ్రాముల గోల్డ్ ధర రూ.40, 652 పలికింది. దీంతో బులియన్ మార్కెట్లో బంగారం ధర మళ్లీ 40 వేల మార్క్ ను దాటింది.

బంగారం బాటలోనే వెండి

సిల్వర్ ధర కూడా అమాంతంగా పెరిగింది. శుక్రవారం ఒక్క రోజే రూ. 960 పెరగడంతో కేజీ సిల్వర్ ధర రూ.48,870కి చేరింది. రానున్న రోజుల్లో పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్, సిల్వర్ ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు. 10 గ్రాముల గోల్డ్ రూ 45వేలు చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదనే టాక్ వ్యాపారుల నుంచి వినిపిస్తోంది.

Latest Updates