వెయ్యి కిలోల స్వర్ణాలయం

బంగారంతో కట్టిన ఆలయం అనగానే అందరికీ అమృతసర్‌ లోని స్వర్ణదేవాలయం గుర్తుకు వస్తుంది. కానీ రాజస్థాన్‌ లో మరో స్వర్ణదేవాలయం ఉంది. అమృత్ సర్‌లోని ఏడువందల కిలోల బంగారం వాడితే ఈ దేవాలయం కోసం వెయ్యి కిలోల బంగారం వాడారు.19వ శతాబ్దంలో అజ్మీర్‌ దీనిని కట్టించాడు. దీని నిర్మాణానికి వెయ్యి కిలోల బంగారం వాడారు. వెండి, రంగురాళ్లు కూడా ఉపయోగించారు. ఈ గుడి మొదటి అంతస్తులో ఉండే ఒక గదిని స్వర్ణనగరి అని పిలుస్తారు. ఎందుకంటే, ఈ గదిలో ఉండే ప్రతి వస్తువును బంగారంతో తయారు చేశారు.జైన మతానికి చెందిన ఈ ఆలయంలో జైన ప్రవక్తలు సాధించిన విజయాలు,వారి జీవితాలు, జైనుల ఆచారాలు, సంప్రదాయాలు.. అన్నీ శిల్పాలుగా చెక్ కారు. బయట నుం చి చూస్తే ఈ దేవాలయం ఎరుపు రంగులో కనిపిస్తుంది. అందుకే దీనిని లాల్‌ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో మూలవిరాట్‌ అధినాథ్‌ ను జైనులు వాళ్ల సంప్రదాయ పద్ధతి ప్రకారం పూజిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో 82 అడుగుల ఎత్తైన వృక్ష స్తంభం ఉంది. అయితే ఈ దేవాలయం జైనుల్లోని దిగంబర శాఖకు చెందింది. దొంగలు ఒకసారి దీనిని ధ్వంసం చేసినా అజ్మీర్ మళ్లీ నిర్మించాడు.

Latest Updates