ప్రముఖ నటుడు గొల్లపూడి మారూతీరావు కన్నుమూత

ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీ రావు(80) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న ఆయన చెన్నైలోని  ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు.  ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో వెండితెరకు పరిచయం అయిన గొల్లపూడి.. చివరి  చిత్రం జోడి. గొల్లపూడి 250 కి పైగా సినిమాల్లో నటించారు. ఆరు నంది అవార్డులు అందుకున్నారు. జర్నలిస్టు, రైటర్ ,ఫిలీం ఎడిటర్ ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి. 1939 ఏప్రిల్ 14 న విజయనగరంలో జన్మించారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు.

యముడికి మొగుడు, స్వాతిముత్యం, అభిలాష, ఛాలెంజ్, ప్రేమ, ఆదిత్య 369, మురారీ, లీడర్, బ్రోకర్, కంచె, సైజ్ జీరో, మనమంతా వంటి హిట్ చిత్రాల్లో నటించారు గొల్లపూడి. రైతు కుటుంబం, దొరబాబు, ఓ సీత కథ, అన్నదమ్ముల అనుభందం, శుభలేఖ,కళ్లు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలకు రైటర్ గా పనిచేశారు. ప్రేమపుస్తకం సినిమాకు దర్శకత్వం వహించారు.

Latest Updates