10ఏళ్ల బాలుడు..10సెక‌న్ల‌లో 10ల‌క్ష‌లు కాజేశాడు

మ‌ధ్య‌ ప్ర‌దేశ్ లో విచిత్రం చోటు చేసుకుంది. ప‌దేళ్లా బాలుడు బ్యాంక్ నుంచి రూ.10ల‌క్ష‌ల్ని దొంగిలించాడు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో నీముచ్ జిల్లాకు చెందిన బ్యాంక్ లో దొంగ‌త‌నం జ‌రిగింది. సుమారు రూ.10ల‌క్ష‌లు మాయ‌మైన‌ట్లు బ్యాంక్ అధికారులు గుర్తించి పోలీసులకు స‌మాచారం అందించారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు కంగుతిన్నారు. బ్యాంక్ లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ పుటేజ్ చెక్ చేయ‌గా సుమారు 10ఏళ్ల వ‌య‌సున్న బాలుడు సెకెన్ల‌లో ప‌దిల‌క్ష‌లు కాజేసినట్లు గుర్తించారు. ఎవరూ లేని స‌మ‌యంలో బాలుడు క్యాషియర్ క్యాబిన్ లోకి వెళ్లాడు. అక్క‌డే ఉన్న రూ.500నోట్లు ఉన్న 10ల‌క్ష‌ల విలువ చేసిన పెద్ద‌మొత్తాన్ని బ్యాగ్ లో వేసుకోవ‌డం సీసీటీవీ లో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. అంతేకాదు క్యాష్ ప‌నిమీద ప‌క్క‌కి వెళ్ల‌గా క్యాబిన్ ముందు క‌ష్ట‌మ‌ర్లు ఉండ‌గా ఈ దొంగ‌త‌నం జ‌రిగిన‌ట్లు గుర్తించారు పోలీసులు. కేసు న‌మోదు చేసుకొని నిందితుల కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Latest Updates