వ‌ల‌స కూలీల‌కు గొంగిడి సునీత బియ్యం, డ‌బ్బు సాయం

యాదాద్రి భువ‌న‌గిరి: లాక్ డౌన్ క్ర‌మంలో వ‌ల‌స కూలీల‌కు ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధులు ఆప‌న్న హ‌స్త్రం అందిస్తున్న విష‌యం తెలిసిందే. వారికి వ‌స‌తి, భోజ‌న స‌దుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. లాక్ డౌన్ ముగిసేంత వ‌ర‌కు ఎక్క‌డికి వెళ్లోద‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌ల‌స కూలీల‌కు సాయం అందించారు ప్ర‌భుత్వ విప్ గొంగిడ‌డి సునీత‌.

మంగ‌ళ‌వారం యాద‌గిరిగుట్ట‌, రాజపేట‌, మోట కొండూర్ మండ‌లాల్లోని వ‌ల‌స కూలీల‌కు ఒక్కొక్క‌రికీ 12 కిలోల బియ్యం, రూ.500 అంద‌జేశారు గొంగిడి సునీత‌. సాయం చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రూ ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు ప్ర‌భుత్వ విప్ గొంగిడి సునీత‌.

Latest Updates