పిల్లల పెరుగుదలకు మంచి ఫుడ్

పిల్లల పెరుగుదలకు మంచి ఫుడ్ ఎంతో అవసరం. పాలలో ఉండే కాల్షియం, ఫాస్పరస్‌ ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రతిరోజూ రెండుపూటలా పాలు ఇవ్వటం మంచిది. చిక్కుళ్లు కూడా పిల్లల పెరుగుదలకు బాగా పనిచేస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, పీచు, కాల్షియం, ఇనుము, విటమిన్‌ –బి ఉంటాయి. కొవ్వు శాతం కూడా తక్కువే. శరీరానికి అవసరమయ్యే అత్యవసర పోషకాలు మెండుగా ఉంటాయి. చిక్కుడు, సోయా, రాజ్మా, ఉలవలతో కూడిన ఫుడ్ పిల్లలకు ఇస్తుండాలి. పిల్లల పెరుగుదలలో గుడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఎక్కువ మొత్తంలో ప్రొటీన్లు, విటమిన్‌ –బి పోషకాలు మెదడు అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

వీటితో పాటు ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్‌ – డి, ఫోలియేట్‌ , జింక్‌ , ఇనుము, సెలీనియం ఉంటాయి. ఇవన్నీ పెరుగుదలకు తోడ్పడతాయి. పిల్లలు చీజ్‌ ఇష్టంగా తింటారు. ఇది సులువుగా జీర్ణమవుతుంది. ఇందులో ప్రొటీన్లు, విటమిన్‌ -బి–12, ఫాస్పరస్‌ ఉంటాయి. మాంసం తినలేని పిల్లలకు దీన్ని ఇవ్వొచ్చు. ఎదిగే వయసులోనే పిల్లలు శారీరకంగా, మానసికంగా బలంగా తయారవుతారు. కాబట్టి పిల్లల పెరుగుదలకు పోషకాలతో కూడిన ఫుడ్ అందించాలి.

see also: బీజేపీ ఓట్లు పెరిగాయ్​

నిజాం టిఫిన్ బాక్స్ కొట్టేసింది వీరే..

దిష్టి బొమ్మలుగా మారిన ముద్దుగుమ్మలు

Latest Updates