మంచి అమ్మాయిలు త్వరగా నిద్రపోతారు

‘మంచి అమ్మాయిలు త్వరగా నిద్రపోతారు’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ. సోష‌ల్ మీడియా‌లో పోస్ట్ చేసిన ఈ కామెంట్ పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఫేస్‌బుక్‌లో మార్కండేయ పెట్టిన పోస్టుపై ఒక మహిళ కామెంట్‌ చేశారు. ఆమెకు కట్జూ బదులిచ్చారు. వారిద్దరి మధ్య జ‌రిగిన చాటింగ్ లో ‘నీకు నిద్ర రావట్లేదా?’ అని కట్జూ ఆమెను ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వకముందే.. ‘మంచి అమ్మాయిలు త్వరగా నిద్రిస్తారు’ అంటూ స్మైలీ ఎమోజీలు పెట్టారు. దీంతో కట్జూపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కట్జూ ఇలా మహిళలపై గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యారు

Latest Updates