మానవత్వం చాటుకున్నవాట్సాప్ గ్రూప్ సభ్యులు

వైద్యం కోసం మహిళకు ఆర్థిక సాయం

మల్కాజిగిరి, వెలుగు: మల్కాజిగిరిలో నివసించే ఓ మహిళ అనారోగ్యంతో ఇబ్బందిపడుతుండడంతో ఆమెకు మానవ సేవే మాధవ సేవ వాట్సాప్ గ్రూప్ సభ్యులు ఆర్థిక సాయం చేశారు. మల్కాజిగిరి, మిర్జాలగూడకు చెందిన ఉమాదేవి కుడికాలుకి ఇన్ ఫెక్షన్ కావడంతో కాలును తొలగించారు . అనంతరం ఆమె కాలికి ఉన్న ఎముక పెరగడంతో మరోసారి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. వైద్యం కోసం సుమారు 70 వేల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు.

విషయం తెలుసుకున్న మల్కాజిగిరి, గౌతంనగర్ మానవ సేవే మాధవ సేవ గ్రూప్ ప్రెసిడెంట్ కుమ్మరి రాజు, గ్రూప్ మెంబర్స్​ కలిసి బాధితురాలు ఉమాదేవి కొడుకు మధుకు రూ.32 వేల నగదు అందజేశారు. ఉమాదేవి చికిత్సకు ఇంకా 50 వేలు ఖర్చు అవుతుందని, సాయం చేయాలనుకునే వారు 9177534151లో సంప్రదించాలని కోరారు.

see also: 93 ఏళ్ల వయసులో పీజీ పట్టా

see also: ‘నాన్న’కూ 7 నెలల సెలవులు

చెర్రీ నెక్స్ట్ సినిమా చిరుతోనా.. వెంకీతోనా..

Latest Updates