ఉద్యోగులకు గుడ్ న్యూస్: ESI చందా తగ్గింపు

good-news-for-employees-esi-subscription-reduction

కేంద్ర ప్రభుత్వం చిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. వైద్య సేవలు అందించే కార్మిక రాజ్య భీమా సంస్థ (ESI) పరిధిలోకి వచ్చే ఉద్యోగులు కట్టాల్సిన చందాను తగ్గించింది. ఈఎస్‌ఐ చట్టం కింద ప్రస్తుతం వారు చెల్లిస్తున్న చందాను 6.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది.

ఉద్యోగి చందా వాటాను 1.74 నుంచి 0.75కి, యాజమాన్య వాటాను 4.75 నుంచి 3.25 శాతానికి తగ్గింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం. చందాలో కొంతభాగాన్ని ఉద్యోగి, మిగతా మొత్తాన్ని యాజమాన్యం చెల్లిస్తుంటుంది. జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి కలగనుంది. కంపెనీలకు రూ. 9 వేల కోట్లు ఆదా అవుతాయని భావిస్తున్నారు.

Latest Updates