వచ్చే నెల దాకా ఫాస్టాగ్‌ స్టిక్కర్‌​​ ఫ్రీ

న్యూఢిల్లీ: వెహికల్‌‌ ఓనర్లకు గుడ్‌‌న్యూస్‌‌! వచ్చే నెల 31 దాకా వెహికల్స్‌‌కు ఉచితంగా ఫాస్టాగ్‌‌ స్టికర్​ ఇస్తామని నేషనల్‌‌ హైవే అథారిటీ ఆఫ్‌‌ ఇండియా (ఎన్‌‌హెచ్‌‌ఏఐ) వెల్లడించింది. దేశమంతటా ఉన్న 770 టోల్‌‌ప్లాజాల్లో ఫ్రీ ఫాస్టాగ్‌‌ తీసుకోవచ్చు. ఫలితంగా వెహికిలిస్టులకు రూ.100 ఆదా అవుతుంది. మనదేశంలో ప్రస్తుతం 87 శాతం మంది వెహికిలిస్టులు ఫాస్టాగ్‌‌ ద్వారా టోల్‌‌ఫీజు చెల్లిస్తున్నారు.  ఫాస్టాగ్‌‌ వాలెట్‌‌లో  మినిమమ్‌‌ అమౌంట్‌‌ను మెయింటెయిన్‌‌ చేయాలనే రూల్‌‌ను ఎన్‌‌హెచ్‌‌ఏఐ తొలగించింది. ఎలక్ట్రానిక్ టోల్‌‌ ప్లాజాల వద్ద వెహికల్స్‌‌ కదలికలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.  ‘దేశంలో ఫాస్టాగ్‌‌ వాడకాన్ని మరింత పెంచేందుకు, టోల్‌‌ గేట్ల వద్ద ట్రాఫిక్‌‌ను తగ్గించేందుకు ఫాస్టాగ్‌‌ వాలెట్‌‌ లేదా లింక్డ్‌‌ బ్యాంక్‌‌  అకౌంట్లలో మినిమమ్ అమౌంట్‌‌ను తప్పనిసరిగా మెయింటెయిన్ చేయడాన్ని కూడా తొలగిస్తున్నాం’ అని ఎన్‌‌హెచ్‌‌ఏఐ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. తాజా నిర్ణయంతో  ఫాస్టాగ్‌‌ అకౌంట్‌‌ లేదా వాలెట్లలో యూజర్ల బ్యాలెన్స్ నెగిటివ్ కాకుండా ఉంటే చాలు, టోల్‌‌ ప్లాజాల నుంచి వెహికల్స్‌‌ పంపుతారు. ప్లాజాలను దాటాక యూజర్ల ఫాస్టాగ్‌‌ బ్యాలెన్స్ నెగిటివ్‌‌లోకి వెళితే మాత్రం, బ్యాంకులు వారి సెక్యూరిటీ డిపాజిట్ల నుంచి డబ్బులను కట్ చేసుకుంటాయి. దేశంలో 2.54 కోట్ల మంది ఫాస్టాగ్‌‌ యూజర్లున్నారు.  ఈ నెల 15 నుంచి టోల్‌‌ ప్లాజాల దగ్గర చెల్లింపులను తప్పనిసరిగా ఫాస్టాగ్‌‌ ద్వారానే చేయాలి. లేకపోతే టోల్‌‌ఫీజుకు రెండింతలు వసూలు చేస్తారు.

ఇవి కూడా చదవండి

4 నెలల్లో జెట్‌ ఎయిర్​వేస్​ విమానాలు

68 ఏండ్లు జైల్లోనే: 83 ఏండ్ల వయసులో బయటికొచ్చిండు

చార్మినార్ ను డేంజర్లో పడేస్తున్నరు!

నాటినోళ్ల పేరే.. మొక్కకు పెడుతున్నరు

Latest Updates