టిక్ టాక్ యాప్ ను బ్లాక్ చేసిన గూగుల్

టిక్ టాక్ యాప్ యాక్సెస్ ను బ్లాక్ చేస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. డౌన్ లోడ్లను నిషేధించామని, మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని గూగుల్ తెలిపింది. ఈ యాప్ పోర్నోగ్రఫీని ప్రోత్సహిస్తోందని, చిన్నారుల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దాఖలైన పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టు యాప్ ను బ్యాన్ చేస్తున్నట్టు ప్ర‌క‌టించింది. టిక్ టాక్ ను అందిస్తున్న చైనా సంస్థ బైటెండెన్స్ టెక్నాలజీ రివ్యూ పిటిషన్ వేసింది. ఈ నెల 3వ తేదీన టిక్ టాక్ ను నిషేధించాలన్న ఉత్తర్వులు వెలువడగా, భారత్ వంటి పెద్ద మార్కెట్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేని బైటెండెన్స్, తన వంతు ప్రయత్నాలు చేసి విఫలమైంది. సుప్రీంకోర్టును సంస్థ ప్రతినిధులు ఆశ్రయించగా, కేసును మద్రాస్ హైకోర్టుకే బదిలీ చేస్తూ అత్యున్నత ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. యాప్ ను నిషేధించడం ఇండియాలో వాక్ స్వాతంత్రానికి విఘాతమని బైటెండెన్స్ చేసిన వాదనతో న్యాయమూర్తులు ఏకీభవించలేదు. గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ ను తొలగించామని గూగుల్ ప్రటించగా, యాపిల్ మాత్రం ఇంకా స్పందించలేదు. జనవరి నాటికి ఈ యాప్ 24 కోట్ల స్మార్ట్ ఫోన్లలో ఇన్ స్టాల్ అయ్యింది.

Latest Updates