అమెరికన్లకు ఉద్యోగ శిక్షణ : గూగుల్‌

ఉద్యోగాలను సాధించేందుకు రెడీ అయ్యేలా అమెరికా యువతకు ట్రైనింగ్ ఇవ్వనుంది టెక్ దిగ్గజం గూగుల్. దాదాపు 2.50 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. డల్లాస్‌ లోని ఎల్‌ సెరంట్రో కమ్యూనిటీ కాలేజీలో, అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్‌తో కలిసి ఆయన ఒక సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఐదేళ్లలో 2.50 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే తమ లక్ష్యమని చెప్పారు. అమెరికాకు ప్రాధానత్యనిచ్చే సంస్థల్లో గూగుల్‌ కచ్చితంగా ఉంటుందని తెలిపారు.

అమెరికన్‌ పౌరులకు కార్పొరేట్‌ సంస్థలు ఉద్యోగ నైపుణ్య శిక్షణనిచ్చే పథకాన్ని 2018 జూలైలో ట్రంప్‌ ప్రారంభించారు. ఇప్పటికే గూగుల్‌ గ్రో విత్‌ గూగుల్‌ పేరిట జాతీయ నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తూ.. వివిధ ఆన్‌లైన్‌ స్కిల్స్ లను ఉచితంగా నేర్పిస్తోంది.

Latest Updates