కొత్త ఫీచర్లతో గూగుల్ క్రోమ్

గూగుల్ సెర్చింజన్ ‘క్రోమ్’ కొత్త వెర్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ‘క్రోమ్ 73’గా పిలిచే కొత్త వెర్షన్ వచ్చే నెలలో విడుదల కానున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ వెర్షన్ లో అనేక కొత్త ఫీచర్లు ఉండనున్నాయి. ‘డెస్క్ టాప్’, ‘ల్యాప్ టాప్ ’పై మల్టీమీడియా కీస్ ను సపోర్ట్ చేసేలా కొత్త వెర్షన్ ఉండనుంది. ‘ప్లే’, ‘పాజ్’, ‘ప్రీవియస్ నెక్స్ట్’, ‘నెక్స్ట్ ట్రాక్ ’, ‘సీక్ బ్యాక్ వర్డ్’, ‘సీక్ ఫార్వార్డ్’ వంటి ఆప్షన్లు కీ బోర్డుపై సపోర్ట్ చేస్తాయి. అయితే వీటిని ట్యాబ్ లెవెల్లో కాకుండా బ్రౌజర్ లోనే వాడుకునే వీలుంది.

గూగుల్ క్రోమ్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నా, మినిమైజ్ చేసినా ట్యాబ్ లను ఆపరేట్ చేయొచ్చు. ఒక ట్ యాబ్ లో యూట్యూబ్ వీడియో చూస్తుండగానే, మరో ట్యాబ్ ఓపెన్ చేసినా కూడా యూట్యూబ్ ట్ యాబ్ ని ఆపరేట్ చేయొచ్చు. ఇలాంటి ఫీచర్ అందిస్తున్న తొలి బ్రౌజర్ ఇదే. నెవర్ స్లో మోడ్ అనే కొత్త ఫీచర్ ను కూడా తీసుకు రానుంది. దీని ప్రకారం కొత్త వెర్షన్ తక్కువ మెమొరీని వాడుకుంటుంది. ఇప్పటికే గూగుల్ క్రోమ్ ఎక్స్ టెన్షన్ పాస్ వర్డ్ చెకప్ ఫీచర్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ ఫీచర్ క్రోమ్ ఓఎస్, మ్యాక్ ఓఎస్ లపై అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ఏడాదిలో ‘లైనక్స్’ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Latest Updates