గూగుల్ ఉద్యోగులకు శుభవార్త..త్వరలో హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్

కరోనా దెబ్బతో పెద్ద పెద్ద కంపెనీలు తన స్ట్రాటజీని అప్లయ్ చేస్తున్నాయి. కరోనా దెబ్బకు ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. దీంతో కంపెనీలు పనివిధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి.

సంస్థలను ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తూ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చాలా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు మొగ్గుచూపుతున్నాయి. గూగుల్ సైతం భవిష్యత్ లో ఉద్యోగుల విధుల్లో సమూల మార్పులు చేస్తూ.. హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ తరహాలో పనిచేయనున్నట్టు  గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు.

తాము నిర్వహించిన సర్వేలో 62 ఉద్యోగులు ఆఫీస్ కు వచ్చి విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే వారు పూర్తి స్థాయిలో ఆఫీస్ కు వచ్చేందుకు ఇష్టపడడం లేదన్నారు. అందుకే ఉద్యోగులకు అనుగుణంగా నెలలో కొన్ని రోజులు మాత్రమే రిపోర్ట్ తయారు చేసేందుకు ఆఫీస్ కు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.

Latest Updates