గూగుల్ పై వస్తున్న ఆరోపణలు అవాస్తవం: పిచాయ్

గూగుల్‌ తన వినియోగదారుల ప్రైవసీని, డేటాను అవసరాలు అనుగుణంగా వాడుకుంటోందని వస్తున్న ఆరోపణలను గూగుల్‌ సిఈఓ సుందర్‌ పిచాయ్ ఖండించారు. ప్రైవసీ అనేది విలాస వస్తువు కాదని అది కేవలం ఖరీదైన వస్తువులు, సేవలు పొందగలిగిన సామర్ధ్యం ఉన్న ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌కు రాసిన ఆర్టికల్ లో గూగుల్‌ పాలసీలను ఆయన బలంగా సమర్ధించారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ప్రైవసీ అనేది సమానంగా ఉంటుందని, ఈ విషయంలో గూగుల్‌ ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటుందని పిచాయ్ అన్నారు.

 

Latest Updates