గూగుల్ పే తో ఫాస్టాగ్‌ రీఛార్జ్‌

ప్రముఖ ఆన్‌లైన్‌ లావాదేవీల అప్లికేషన్‌ గూగుల్‌పే వినియోగదారులకు మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తమ ఫాస్టాగ్‌ ఖాతాను ఈజీగా రీఛార్జ్‌ చేసుకునేందుకు ప్రత్యేక యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేజ్‌ (UPI) సౌకర్యాన్ని యాప్‌ ద్వారా ప్రారంభించింది. గూగుల్‌ పే కు ఫాస్టాగ్‌ ఖాతాను లింక్‌ చేసుకుని రీఛార్జ్‌ చేసుకోవడంతో పాటు పేమెంట్స్‌ ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు తెలిపింది. గూగుల్‌ పే ద్వారా రీఛార్జ్‌ చేసుకోవాలనుకునే వినియోగదారులు యాప్‌లోని బిల్‌ పేమెంట్స్‌ సెక్షన్‌ కింద ఉండే ఫాస్టాగ్‌ కేటగిరీని ఎంపిక చేసుకోవాలి. తర్వాత మనకు ఫాస్టాగ్‌ జారీ చేసిన బ్యాంకును ఎంచుకోవాలి. ఆ తర్వాత వెహికల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి బ్యాంకు ద్వారా పేమెంట్‌ చేయవచ్చని సంస్థ తెలిపింది.