గూగుల్ ఫొటో ఆర్గనైజేషన్

ఫొటో ఆర్గనైజేషన్ చాలా సింపుల్. కావాల్సిన ఫొటోలతో ఆల్బమ్ క్రియేట్ చేసుకోవాలి.ఇందుకోసం యాప్ లో కుడివైపు పైన కనిపించే త్రీ డాట్స్ ఐకాన్ పై క్లి క్ చేయాలి. దీనిలో ‘ఆల్బమ్‌’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి, నచ్చిన టైటిల్ పెట్టుకుంటే కొత్త ఆల్బమ్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత కింద ‘ప్లస్’గుర్తుతో సెలెక్ట్ ఫొటోస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లి క్ చేసి ​కావాల్సి న ఫొటోలు, వీడియోలపై క్లి క్ చేసి పైన కనిపించే ‘యాడ్’ ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. అంతే ఫొటోలు, వీడియోలతో ఆల్బమ్ క్రియేట్ అవుతుంది. లేదా యాప్ లో కావాల్సి న ఫొటో, వీడియోపై ట్యా ప్ చేసి, పైన కనిపించే ‘ప్లస్’ ఆప్షన్ క్లి క్ చేసి కూడా ఆల్బమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డర్స్ అన్నీ ఆల్బమ్స్ ట్యా బ్ లో కనిపిస్తాయి.

ఆటోపైలట్….

మాన్యువల్ గా ఆల్బమ్స్ క్రియేట్ చేయడానికి,అందులో ఫొటోలు యాడ్ చేయడానికి కొంత టైమ్ తీసుకుంటుంది. అయితే ఈ శ్రమ లేకుండానే వాటంతట అవే ఆల్బమ్ లో ఫొటోలు సేవ్ చేసుకునే వీలుంది. ముందుగా త్రీ డాట్స్ ​క్లిక్ చేస్తే కనిపించే ‘ఆల్బమ్’ సెలెక్ట్ చేసుకోవాలి. దీనిలో కింద ‘ఆటోమెటికల్లీ యాడ్ ఫొటోస్ అండ్ పీపుల్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లి క్ చేస్తే కింద అనేక ఫొటోలు, వీడియోలు కనిపిస్తాయి. వాటిని క్లి క్ చేసి సేవ్ చేసుకోవాలి. అంతే.. ఆ ఫైల్స్ ద్వారా సేవ్ అయిన పీపుల్, పెట్స్ కు సంబంధించిన ఫొటోలు ఎప్పుడు గ్యాలరీలోకి చేరినా వెంటనే అవి ఆటోమేటిక్ గా ఆల్బమ్ లో సేవ్ అవుతుంటాయి. ఈ ఆల్బమ్ కు కూడా ప్రత్యేక పేర్లు పెట్టుకోవచ్చు. అయితే దీనిలో పెట్స్, పీపుల్ ఫొటోస్ మాత్రమే సేవ్ అవుతాయి.

ప్లే ఫేవరెట్స్….

ఇష్టమైన ఫొటోలు, వీడియోలను ‘ఫేవరెట్స్’గా సెలెక్ట్ చేసుకునే వీలుంది. దీని వల్ల స్పె షల్ అనిపించే ఫొటోలను ఒకే చోట చూడొచ్చు. కావాల్సి న ఫొటో లేదా వీడియోను ఓపెన్ చేయాలి. కుడివైపు పైన కనిపించే ‘హోలో స్టార్’ ఐకాన్ క్లి క్ చేయాలి.అవి ఫేవరెట్ ఐటమ్స్ గా మారిపోతాయి. వీటితో ‘ఫేవరెట్స్’ అనే ప్రత్యేకమైన ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు.

సెర్చ్ అండ్ సార్ట్….

ప్రత్యేకించి యూజర్లు ఇలా ఫోల్డర్స్, ఆల్బమ్స్ క్రియేట్ చేసుకోకపోయినా ‘గూగుల్ ఫొటోస్’ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి ఫొటోలను పర్సన్స్, లొకేషన్స్, థింగ్స్, యానిమేషన్స్, మూవీస్ వంటి స్పె షల్ కేటగిరీలుగా విభజిస్తుంది. వీటి వల్ల సు లభంగా ఫొటోలను వివిధ కేటగిరీలుగా సెర్చ్ చేసుకోవచ్చు. యాప్ లో కింది వైపున కనిపించే ‘ఆల్బమ్’పై ట్యా ప్ చేయాలి. పైన వివిధ కేటగిరీలుగా ఫోల్డర్లు కనిపిస్తాయి.ఇందులో పీపుల్ సెలెక్ట్ చేసుకుంటే ‘పీపుల్, పెట్స్’ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కనిపిస్తాయి. ‘ప్లేసెస్’ సెలెక్ట్ చేసుకుంటే ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలు, ‘థింగ్స్’ సెలెక్ట్ చేసుకుంటే వివిధ వస్తువులను సూచించే ఫొటోలు కనిపిస్తాయి.

Latest Updates