15న పిక్సెల్ 4 సిరీస్ ఫోన్ల విడుదల

గూగుల్‌‌ నుంచి పిక్సెల్‌‌ సిరీస్‌‌లో రానున్న కొత్త ఫోన్లు ఈ నెల 15న మార్కెట్లోకి రానున్నాయి. పిక్సెల్‌‌ 4, పిక్సెల్‌‌ 4 ఎక్స్‌‌ఎల్‌‌  మోడల్స్‌‌ రెండింటిని గూగుల్‌‌ విడుదల చేయనుంది. ‘పిక్సెల్‌‌ 3’కి ఇవి అప్‌‌డేటెడ్‌‌ వెర్షన్‌‌గా రూపొందాయి. రెండూ హై ఎండ్‌‌ ఫోన్లే కాబట్టి ధర ఎక్కువగానే ఉంటుంది. ‘పిక్సెల్‌‌ 4’ మోడల్‌‌ 5.7 అంగుళాల స్క్రీన్‌‌, ‘పిక్సెల్‌‌ 4 ఎక్స్‌‌ ఎల్‌‌’ మోడల్‌‌ 6.3 అంగుళాల అమోల్డ్‌‌ స్క్రీన్‌‌ కలిగి ఉంది. రెండూ సాలిడ్‌‌ రాడార్‌‌‌‌ చిప్‌‌తోనే రూపొందాయి. అంటే ఇవి లేటెస్ట్‌‌ యాపిల్‌‌ ఫోన్లలోని సెక్యూర్‌‌‌‌ ఫేస్‌‌ ఫీచర్‌‌‌‌లా ఉంటుంది. ఈ రెండు ఫోన్లు క్వాల్‌‌కామ్​ స్నాప్‌‌డ్రాగన్‌‌ 855 ప్రాసెసర్‌‌‌‌తో రూపొందాయి. 6జీబీ ర్యామ్‌‌, 128 జీబీ మెమరి కలిగి ఉంది. డ్యుయల్‌‌ రేర్‌‌‌‌ కెమెరా ఉండే చాన్స్‌‌ ఉంది. ఒకటి 12 ఎంపీ, మరోటి 16 ఎంపీ టెలిఫొటో లెన్స్‌‌ కలిగి ఉంటాయి. వీటి ధరలు 70–85 వేల రూపాయల వరకు ఉండొచ్చు.

Latest Updates