త్వరలో ఇండియాలోకి  గూగుల్ పిక్సల్ 5

హైదరాబాద్: గ్లోబల్గా లాంచ్ అయిన గూగుల్ ‘పిక్సల్ 5’, ‘పిక్సల్ 4ఏ’ స్మార్ట్ ఫోన్లు ఈ నెలలోనే ఇండియన్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిక్సల్ 5 ధర రూ. 79,990 గా ఉంటుందని అంచనా.  ఇందులో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 765జీ చిప్ సెట్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి.  3,500 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. డ్యూయల్ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి. రెండు ఫోన్లూ అండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తాయి.

 

Latest Updates