గూగుల్ లో కొత్త ఫీచర్…

న్యూఢిల్లీ: అడిగిన ఏ విషయన్నాయినా ఇట్టే కళ్ల ముందు ఉంచే గూగుల్ తల్లి.. ఇకపై ఏమీ దాచుకోబోవడం లేదు. మీరు వెతికిన ఈ విషయాన్నైనా మీరే డిలీట్ చేసేసుకునే చాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఒక్క సెర్చ్ ఇంజన్ మాత్రమే కాకుండా మ్యాప్స్, అసిస్టెంట్, యూట్యూబ్ కూ ఈ ఫీచర్ ను తేబోతోంది. ఇందులో మూడు లేదా 18 నెలల వరకూ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. మూడు నెలల ఆప్షన్ ఎంచుకుంటే టైం లిమిట్ దాటిన తర్వాత సెర్చ్ హిస్టరీ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. 18 నెలలకు ఎంచుకున్నా టైం దాటిన తర్వాత ఇలానే జరుగుతుంది.

మ్యాప్స్ కోసం కొత్తగా ఇన్ కాగ్నిటో మోడ్ ను తేబోతోంది గూగుల్. క్రోమ్, సెర్చ్, మ్యాప్స్, యూట్యూబ్, అసిస్టెంట్, న్యూస్ లో ఒక్క ట్యాప్ తో ప్రైవసీ, సెక్యూరిటీ ట్యాబ్ కు వెళ్లేలా ఫీచర్ ను తేనుంది. ఇటీవల శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన డెవలపర్స్ కోసం నిర్వహించిన గూగుల్ ఐవో వార్షిక మీటింగ్ లో కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ఈ విషయాలను వెల్లడించారు. ఆండ్రాయిడ్ నెక్ట్స్ వెర్షన్ ‘ఆండ్రాయిడ్ క్యూ’ రెడీ అవుతున్నట్లు తెలిపారు. ఇటీవల ఒప్పో, అసెస్, నోకియా క్యూ క్లబ్ లో చేరిపోయాయి. కొత్త ఫీచర్స్ కొద్ది నెలల్లో అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

Latest Updates