కొత్త ట్యాబ్​తో గూగుల్ న్యూస్​

డెస్క్​టాప్​పై గూగుల్​ సెర్చ్ లో న్యూస్​కు సంబంధించి అప్​డేటెడ్​ వెర్షన్​ తీసుకొస్తున్నట్లు గూగుల్​ ప్రకటించింది. డెస్క్​టాప్​పై కొత్త డిజైన్​తో న్యూస్​ ట్యాబ్​ను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పింది. కొత్తగా రానున్న డిజైన్​లో పబ్లిషర్​కు సంబంధించిన వివరాలు మరింత స్పష్టంగా ఉంటాయని తెలిపింది. వివిధ కేటగిరీలకు చెందిన ఆర్టికల్స్​ ఆర్గనైజేషన్​ కూడా సులభంగా అర్థమయ్యేలా ఉంటుందని, యూజర్లు తమకు కావాల్సిన న్యూస్​ను సులభంగా ఎంపిక చేసుకోవచ్చని ట్విట్టర్​లో వెల్లడించింది.

ఇప్పటివరకు న్యూస్​ అన్నీ ఒక లిస్టులాగా మాత్రమే కనిపించేవి. అయితే కొత్త ట్యాబ్​లో కార్డ్​ ఫార్మాట్​లో కనిపిస్తాయి. హెడ్​లైన్స్‌‌,  పబ్లిషర్​ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక అంశానికి సంబంధించిన న్యూస్​ అన్నీ ఒకే చోట వివరంగా కనిపిస్తాయి. దీనివల్ల యూజర్లు ఏ వార్త గురించైనా లోతైన సమాచారం తెలుసుకోగలుగుతారు. మరో రెండు వారాల్లో ఈ న్యూస్​ ట్యాబ్​ అందరికీ అందుబాటులోకి వస్తుంది.

Latest Updates