గూగుల్ ప్లే నుంచి ఇన్‌స్టాంట్‌ లోన్‌యాప్స్‌ తొలగింపు

ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్స్‌ కేసుకు సంబంధించి సైబర్ క్రైం పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు స్పీడప్ చేస్తున్నారు. ఇందులో భాగంగా  పోలీసుల రిక్వెస్ట్‌తో యాప్స్‌ తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టిన గూగుల్‌ ప్లేస్టోర్‌ ఇప్పటివరకు 200కు పైగా లోన్‌యాప్స్‌ను డిలీట్ చేసింది. మరో 450 కి పైగా లోన్‌ యాప్స్‌ను తీసేయాలంటూ పోలీసులు గూగుల్‌కు లేఖ రాశారు.  హైదరాబాద్‌ నుంచి 288, సైబరాబాద్‌లో 110, రాచకొండ నుంచి 90 లోన్‌ యాప్స్‌ తొలగించాలని లేఖలో తెలిపారు.

ఇన్‌స్టాంట్‌ లోన్స్ కేసులో పోలీసులు వందల సంఖ్యలో బ్యాంక్‌ అకౌంట్లను ఫ్రీజ్‌ చేశారు. ఇప్పటివరకు 3 కమిషనరేట్లలో కలిపి రూ.450 కోట్ల నగదు ఫ్రీజ్‌ అయింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో కొట్టేసిన డబ్బులతో చైనీయులు ఈ లోన్‌ యాప్‌లను రన్ చేశారు. ఇప్పటివరకు నలుగురు చైనాకు చెందిన వారిని అరెస్టు చేశారు సైబర్ క్రైం పోలీసులు.

Latest Updates